సెప్టెంబర్ 23న అమెరికాకు మోడీ…

వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లి సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. యూఎన్ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నరేంద్ర మోడీ సెప్టెంబర్ 26 న హాజరుకానున్నారు. అయితే, అంతకు ముందే మోడీ న్యూయార్క్ లో పర్యటిస్తారు.
లాంగ్ ఐల్యాండ్లోని 16 వేల సీట్ల సామర్ధ్యమున్న నాసావు కొలీజియం కమ్యూనిటీ సమావేశానికి మోడీ అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించిన మోడీ ప్రసంగించనున్నారు. సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’తో ప్రారంభమయ్యే సెప్టెంబర్ 22 నుండి 28 వరకు ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి సమావేశాల కోసం మోడీ న్యూయార్క్ వెళ్లనున్నారు.
సెప్టెంబర్ 26న జరిగే జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తారు. అయితే, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున, అక్కడి దేశీయ రాజకీయాలపై ప్రభావం ఉండకూడదని, అమెరికా రాజకీయ నాయకులు ఈ సమావేశాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.
న్యూయార్క్ లోని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో 2014 సెప్టెంబర్ లో జరిగిన భారీ కమ్యూనిటీ సభలో మోదీ ప్రసంగించి పదేళ్లు దాటింది.న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్ లో వేలాది మంది భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మళ్లీ భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు.