సింగపూర్ టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో… ఎన్టీఆర్ జయంతి వేడుకలు
తెలుగుదేశం పార్టీ సింగపూర్ ఫోరం సింగపూర్ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు నాంది పలికన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయనతో అతకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇలా దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కొలికపూడి శ్రీనివాసరావు కొనియాడారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ పాలుపంచుకోవాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ టీటీడీ ఫోరం సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.






