భారత్ కు రానున్న తొమ్మిది దేశాల ప్రవాసులు
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి నేటి నుంచి తీసుకురానున్నారు. ప్రవాసియులను ఇండియాకు తరలించే కార్యక్రమం ఈ రోజు నుండి మొదలుకానుంది. మే 7 నుంచి మే 13వ తేదీ వరకు 64 విమానాల్లో 12 దేశాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రవాసులు భారత్కు రానున్నారు. కాగా మొదటి రోజు తొమ్మిది దేశాల నుంచి ప్రవాసులు భారత్కు చేరుకోనున్నారు. యూఏఈ నుంచి రెండు విమానాలు భారత్కు రానున్నాయి. ఒక్కో విమానంలో దాదాపు 200 మంది ప్యాసెంజర్లు ప్రయాణించనున్నారు. మొత్తంగా దాదాపు 2300 మంది ప్రవాసులు తొమ్మి దేశాల నుంచి నేడు భారత్కు పయనం కానున్నారు.






