రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు… ప్రవాసాంధ్రుల సంబరాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవాలకు సినీ నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష మంది ఏపీ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ ఎన్నారై విభాగం ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ మెల్బోర్న్ అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.







