Heal Charity: హీల్ ఛారిటీకి రూ.17 కోట్లు విరాళం ఇచ్చిన ఎన్నారై దంపతులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ ఫౌండేషన్ ట్రస్టీ డాక్టర్ కాజ బాబురావు, డాక్టర్ జానకి కాజ దంపతులు తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో హీల్ ప్యారడైజ్‌లో (Heal Charity) నిర్మిస్తున్న బాలికల హాస్టల్‌కు రూ.10 కోట్ల విరాళ అందజేశారు. డోవర్ డెలవేర్లో నివశిస్తున్న ఈ దంపతులు.. హీల్ చారిటీ ఫౌండేషన్‌కు (Heal Charity) మొత్తం రూ.17 కోట్ల విరాళంగా ఇచ్చారు. వీటిలో రూ.10 కోట్లు బాలికల హస్టల్ కోసమే కావడం గమనార్హం. మొత్తం రూ.30 కోట్లతో నిర్మించనున్న ఈ బాలికల వసతి గృహం భవన నిర్మాణానికి డాక్టర్ కాజ బాబూరావు, డాక్టర్ జానకి దంపతులే గతేడాది డిసెంబరు 18న శంకుస్థాపన చేశారు.







