TTA: టిటిఎ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నవీన్ రెడ్డి మల్లిపెద్ది
 
                                    
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రెసిడెంట్గా నవీన్ రెడ్డి మల్లిపెద్ది(Naveen Reddy Mallipeddi) బాధ్యతలు చేపట్టారు. లాస్ వెగాస్ లో జరిగిన టిటిఎ బోర్డ్ సమావేశంలో ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీఎ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే తనకు ఈ బాధ్యతలు అప్పగించిన టీటీఎ పెద్దలు మల్లారెడ్డి ఇతరుల సహకారంతో సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. నవీన్ రెడ్డి మల్లిపెద్ది రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. చిన్న గ్రామం నుంచి వచ్చి నేడు అమెరికాలోని జాతీయ తెలుగు సంఘమైన టీటీఎకు అధ్యక్షుడయ్యారు. అలాగే యోయో టీవీతో పాటు ఇతర వ్యాపార సంస్థలకు అధినేతగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.











