పేదలకు నిత్యావసరాలు పంపిణి చేసిన నాట్స్
రిమ్మనపూడిలో 500 కుటుంబాలకు చేయూత
భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా రిమ్మనపూడి గ్రామంలో నాట్స్, కంచర్ల ఛారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి పేదలకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు 500 కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను అందించింది. నాట్స్ డైరెక్టర్ కిషోర్ కంచర్ల, నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పాసాని చొరవతో రిమ్మనపూడి గ్రామంలో పేదలకు సాయం చేయాలని నిశ్చయించుకున్న నాట్స్ వెంటనే స్పందించి దానికి కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించింది. నాట్స్ ప్రతినిధుల ద్వారా రిమ్మనపూడి గ్రామంలో నిత్యావసరాల పంపిణీ చేయించింది. పేదలు ఎక్కడైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో.. అలాంటి సమాచారం తమకు వచ్చిన ప్రతి చోట చేతనైనా సాయం చేస్తున్నామని నాట్స్ తెలిపింది. ఈ కష్టకాలంలో తెలుగునాట పేదలకు మరింత సాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.






