లాస్ ఏంజిల్స్ లో ఫుడ్ బ్యాంక్ కు నాట్స్ సాయం
అమెరికా లో తెలుగు వారి సంక్షేమం కోసం పని చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ 1500 డాలర్లు విరాళాన్ని అందించింది. లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ఫుడ్ క్యాన్స్ సేకరించాలని ప్రయత్నించింది. కానీ ఫుడ్ క్యాన్స్ మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో విరాళాల ద్వారా సేకరించిన 750 డాలర్లకు నాట్స్ విభాగం మరో 750 డాలర్లు జోడించి 1500 డాలర్లను స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్ (http://www.pomonafoodbank.org/) కు అందించింది. ఇది నిరాశ్రయులైన పేదల ఆకలి తీర్చేందుకు స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్ వెచ్చించనుంది. పేదల ఆకలి తీరుద్దామని నాట్స్ ఇచ్చిన పిలుపునకు స్పందించి విరాళాలు ఇచ్చిన వారికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం లో భాగంగా మే 23 న ఫుడ్ బ్యాంకు వారు అవసరార్థులకు ఆహారాన్నందించే దిశ గా అడుగులు వేస్తున్నారని నాట్స్ లాస్ ఏంజెల్స్ విభాగం తెలియచేసింది






