ప్రధాని మోదీకి న్యూయార్క్‌లో స్వాగతం పలకనున్న నాటా.. రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరి రోజు!
న్యూయార్క్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన సెప్టెంబరు 22న న్యూయార్క్‌ను సందర్శిస్తారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు ముందుగా తమ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 26 సోమవారం రాత్రి 11.59లోపు https://modiandus.org/register వెబ్సైటులో తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. మోదీ అండ్ యూఎస్ కార్యక్రమంలో నాటా సభ్యులు సంస్థ కోడ్‌తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనంతరం అందజేసే పాస్‌లను ఈమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ పాస్‌లు అందకపోవచ్చని, పాస్ కోసం అదనపు వెరిఫికేషన్ ఉంటుందని నాటా తెలిపింది.







