Nara Lokesh: డల్లాస్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు డల్లాస్ లో ఘన స్వాగతం లభించింది. ఎన్నారై టీడిపి నాయకులు, అభిమానులు, కూటమి నాయకులు ఇతరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు విదేశాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
లోకేష్ వెంట ఏపీ ఎన్ఆర్టీ ఛైర్మన్ డా. వేమూరు రవికుమార్, ఎన్నారై టిడిపి సమన్వయకర్త కోమటి జయరాం వేదికపైకి వచ్చారు. లోకేష్‌కు స్వాగతం పలికిన వారిలో టాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, రామ్ యలమంచిలి, మండువ సురేష్, నవీన్ యర్రమనేని, సుధీర్ చింతమనేని, సుగణ్ చాగర్లమూడి, సూరపనేని రాజా, గుదె పురుషోత్తం చౌదరి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, గొర్రెపాటి చందు, జిల్లెళ్లమూడి వెంకట్, చండ్ర దిలీప్, జాస్తి శ్రీతేజ, సాయి మద్దిరాల తదితరులు ఉన్నారు.






