America: ముందస్తు కాన్పులకు ఇండో అమెరికన్ల పరుగులు…!
 
                                    అమెరికా (America) నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠిన తరం చేయడంతో ఇప్పుడు అక్కడ స్థిరపడిన ఇండో అమెరికన్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తల్లి తండ్రులు విదేశీయులు అయితే.. వారికి అమెరికాలో పుట్టిన వారికి ఆ దేశ పౌరసత్వం లభించదు అని డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో… అమెరికాలో ఉన్న భారతీయులు ముందస్తు కాంపుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ బిడ్డలను.. ట్రంప్ విధించిన ఫిబ్రవరి 20 గడువులోపు ప్రసవించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
గర్భం దాల్చిన 7 లేదా 8 నెలల్లో కాన్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. న్యూజెర్సీలోని ప్రసూతి క్లినిక్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఎస్డి రమ మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. ముందస్తు ప్రసవాల కోసం తనకు చాలా అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు… ఏడు నెలల గర్భవతి అయిన ఒక స్త్రీ తన భర్తతో కలిసి త్వరగా ప్రసవం చేయాలని వచ్చిందని కాని ఆమె మార్చ్ నెలలో ప్రసవించాల్సి ఉందంటూ వివరించారు. ఫిబ్రవరి 20 తర్వాత నుంచి ట్రంప్ తెచ్చిన నిబంధనలు అమలు కావడంతో… తమ బిడ్డలకు పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
పౌరసత్వం అనేది పిల్లలకు… వారి తల్లిదండ్రుల జాతీయత లేదా ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా వారు పుట్టిన దేశం ఆధారంగా పౌరసత్వాన్ని మంజూరు చేయడం ఇప్పటి వరకు అమెరికాతో పాటుగా అనేక దేశాల్లో ఉంది. టెక్సాస్‌లోని ప్రసూతి వైద్య నిపుణుడు ఒకరు మాట్లాడుతూ.. కొంతమంది ఆరు నెలల గర్భంతోనే ప్రసవం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.
ముందుగా ప్రసవం అనేది బిడ్డలకు, తల్లికి మంచిది కాదని తాను చెప్పే ప్రయత్నం చేస్తున్నానని… ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం, ఆహారం తీసుకోవడంలో సమస్యలు, తక్కువ బరువుతో జననానికి సంబంధించిన సమస్యలు, నరాల సంబంధిత సమస్యలు, మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గడచిన రెండు రోజుల్లో నేను 15 నుంచి 20 జంటలతో దీని గురించి మాట్లాడానని ఆయన వివరించారు.











