అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరెస్టు
భార్యను హత్య చేసి, మృతదేహాన్ని దాచిపెట్టాడనే అభియోగంపై భారత సంతతికి చెందిన నరేష్ భట్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. మానస్సాస్ పార్క్ నగరంలో నివాసముంటున్న నరేష్ భట్ తన భార్య మమతా కాఫ్లే భట్ (28) జులై 31 నుంచి కనిపించడం లేదని ఆగస్టు 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమత న్యూయార్క్‌లోనో, టెక్సాస్లోనో బంధువులను కలవడానికి వెళ్లిందని, బయలుదేరే ముందు ఆమె ఫోన్‌ను ధ్వంసం చేసిందని పోలీసులకు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ వారి బంధువులెవరూ లేరని విచారణలో తేలింది. జులై 29 నుంచి ఆగస్టు 1వరకు మమత ఫోన్ డేటా ఆన్‌లోనే ఉంది. అతడి ఇంట్లో రక్తపు మరకలు లభించాయి. దీంతో భట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమార్తెను సామాజిక సేవ సంరక్షణలో ఉంచారు.







