Charuni Patibanda: డెలవేర్ స్టేట్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన చారుణి పాటిబండ ఏకగ్రీవ ఎంపిక
భారత సంతతికి చెందిన చారుణి పాటిబండ-సాంచెజ్ (Charuni Patibanda-Sanchez).. అమెరికాలోని డెలవేర్ 81వ స్టేట్ ఆఫ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆమెను డెలవేర్ స్టేట్ సెనేట్ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం గమనార్హం. గతంలో న్యూ క్యాసిల్ కౌంటీ ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా సేవలందించిన చారుణిని గవర్నర్ మ్యాట్ మేయర్.. డెలవేర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవికి నామినేట్ చేశారు. డెలవేర్‌కు చెందిన ఆమె (Charuni Patibanda-Sanchez) యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు, అలాగే ఎమరీ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి జూరిస్ డాక్టరేట్ అందుకున్నారు. ఇప్పుడు, తను పుట్టిపెరిగిన డెలవేర్ స్టేట్ ప్రభుత్వంలో ఎంతో కీలకమైన పదవిని చారుణి చేపట్టనున్నారు. చారుణి (Charuni Patibanda-Sanchez) తండ్రి శర్మ పాటిబండ.. డెలవేర్ హిందూ టెంపుల్ వ్యవస్థాపకులు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ కాన్ఫరెన్స్‌లో సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన తానా.. శర్మ గారిని సత్కరించింది కూడా.







