న్యూజెర్సీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం
అమెరికాలో ఉండే తెలంగాణ వాసులను కలిసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి యూఎస్ వస్తున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ఐటీ మంత్రి దుడ్డిళ్ల శ్రీధర్ బాబు కూడా యూఎస్ రానున్నారు. వీరిద్దరూ కూడా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగే 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొని, స్థానిక తెలుగు ప్రజలతో ముచ్చటించనున్నారు. ఆగస్టు 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం జరగనుంది. ఇక్కడకు వచ్చే తెలుగు వారందరికీ లంచ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునే వారు https://tinyurl.com/Telangana-CM-Event వెబ్ సైటులో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.







