Texas Shooting: టెక్సాస్‌లో కాల్పులు.. తెలంగాణ యువకుడు దుర్మరణం

అమెరికాలోని డల్లాస్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల హైదరాబాద్ యువకుడు చంద్రశేఖర్ పోలే (Chandrashekar Pole) దుర్మరణం పాలయ్యారు. స్థానికంగా ఒక గ్యాస్ స్టేషన్‌లో పని చేస్తున్న అతనిపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు (Texas Shooting) జరిపాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి అతను కన్నుమూసినట్లు వైద్యులు తెలియజేశారు. బీడీఎస్ చదువుకున్న చంద్రశేఖర్.. 2023లో యూఎస్ వెళ్లి, ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేశాడు. అతను పనిచేస్తున్న గ్యాస్ స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి.. చంద్రశేఖర్‌ను రెండుసార్లు తుపాకీతో కాల్చాడు. డల్లాస్ పోలీసులు అనుమానితుడిని అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ (Chandrashekar Pole) కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తిరిగి తీసుకురావడానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ మరణంతో ఆయన కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు, తదితరులు కూడా చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు.