Hindu Jana Shakti: సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న హిందూ జనశక్తి

అమెరికాలో అధ్యక్షుడు లలిత్ కుమార్ పర్యటన విజయవంతం
భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం తొమ్మిది సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్న హిందూ జనశక్తి (Hindu Jana Shakti) అధ్యక్షుడు లలిత్ కుమార్ అమెరికాలో పర్యటించారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎంతో మందికి మతమార్పిడి యొక్క దుష్ఫలితాలను వివరిస్తూ.. లవ్‌జిహాద్ లాంటి అంశాలపై హిందువులకు హిందూ జనశక్తి యూట్యూబ్ చానల్ ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తూ, నిరంతరం సనాతన ధర్మ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న లలిత్ కుమార్ 45 రోజులపాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో పర్యటించి అనేక ఆలయాలలో మరియు సమావేశాలలో అనేకమందిని కలుసుకొని దేశంలో సనాతన ధర్మం ఎదుర్కొంటున్న పరిస్థితులు, దేవాలయాల స్థితిగతులు వివరిస్తూ హిందువులకు అవగాహన కల్పించారు.
హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ అమెరికాలో తాను జరిపిన పర్యటన విశేషాలను తెలియజేశారు.
అమెరికాలో ఉంటున్న తెలుగువారు మరియు హిందువులు భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి ఏ విధంగా తమ సహాయ సహకారాలను అందించాలి. అలాగే భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో అనే అంశాలను చాలా కూలంకషంగా వివరించారు.
వివిధ అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో మతమార్పిడిలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయి, అందుకోసం విదేశీ నిధులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది, అలాగే హిందూ గ్రంథాలను ఈ మతమార్పిడి ముఠాలు ఏ విధంగా వక్రీకరించి హిందువులను తప్పుదారి పట్టించి మతమార్పిడి చేయిస్తున్నది తెలియజేశారు. అలాగే స్వస్థత ప్రార్థనల పేరుతో కావచ్చు, మరి ఇతరత్రా మోసపూరితమైన మార్గాలను వారు అవలంబిస్తు న్నారు, వాటన్నింటినీ చక్కటి ప్రజెంటేషన్ రూపంలో అందరికీ సవివరంగా తెలియజేసినట్లు చెప్పారు.
ముఖ్యంగా భారతదేశంలో ఏ విధంగా హలాల్ పేరుతో హిందూ ఆలయాలలో అన్ని మత ఆచారాలను కొనసాగిస్తున్నారో, అలాగే హలాల్ పేరుతో ఎంతటి వ్యాపారం చేస్తున్నారో, ఆ నిధులతో హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు ఏ విధంగా సహకరిస్తున్నారో అన్నింటిని ఆయన గణాంకాలతో సహా వివరించిన తీరుకి సభలకు వచ్చిన హిందువు లందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తమ ఆందోళనను కూడా తెలియజేశారు. అలాగే హిందూ జనశక్తి చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు, హిందూ జనశక్తి యొక్క భవిష్యత్తు ప్రణాళికను రాబోయే రోజుల్లో చేయబో తున్న అనేక కార్యక్రమాలను ఆయన వివరించారు. కార్యక్రమాల ప్రణాళికను తెలుసుకున్న అనేకమంది హిందూలు హిందూ జనశక్తికి తమ వంతు సహాయ సహకారా లను అందించడంతో పాటు ఇకపై జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రతి నెల తమ సహకారం ఉంటుందంటూ భరోసా ఇవ్వడం జరిగింది.
నిజంగా భారత దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు యొక్క బాధ్యత అని చెప్పిన లలిత్ కుమార్ మాటలకు స్పందించి తమ బాధ్యతగా హిందూ జనశక్తికి తమ సహాయ సహకారాలు అందివ్వటానికి హిందూవులందరూ ముందుకు రావడం చాలా శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా లలిత్ కుమార్ మరిన్ని పర్యటనలు చేసి హిందువులను సంఘటితం చేయడంతో పాటు నిత్యం చైతన్య పరుస్తూ ఉండాలని అనేక మంది కోరారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా కాలిఫోర్నియా, అనంతరం ఫినిక్స్, డాలస్, సిన్సినాటి, డెట్రాయిట్, అట్లాంటా, న్యూ జెర్సీ, వర్జినియా, ర్యాలీ, ఇంకా అనేక ప్రాంతాలను ఆయన సందర్శించడం జరిగింది. ఈ పర్యటనలో తనకు సహకరించిన పెద్దలకు, ఆత్మీయులకు అలాగే కార్యక్రమాలకు విచ్చేసిన వారికి, ఆలయాల నిర్వాహకులకు, దాతలకు లలిత్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
హిందూ జన శక్తి చేసిన కార్యక్రమాలు
లలిత్ కుమార్ తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా హిందూ జనశక్తి సంస్థ చేసిన పనులను వివరించారు. దాదాపు 150 దాకా అక్రమంగా కడుతున్న చర్చిలు, 20 దాకా మసీదుల నిర్మాణం ఆపి వేసాం. ఇతర మతస్తులు భూమి కొనుక్కొని, కట్టడానికి అనుమతులు తీసుకొని నిర్మాణం చేసుకొంటే అభ్యంతరం లేదని, ఆక్రమించుకున్న భూమితో అనుమతులు లేని కట్టడాలను ఎక్కడా జరిగినా ఆపవలసి బాధ్యత అందరి మీద ఉందని చెప్పారు.
* హిందూ దేవాలయాల వేల ఎకరాల భూములు ఆక్రమణ జరిగితే, ఆయా వ్యక్తు లు, సంస్థలు నుంచి భూములు విడిపించాం.
* తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం, విజయవాడ కనకదుర్గ దేవస్థానం, సింహాచలం దేవస్థానంతో కలిసి ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ లో 22 రిట్ పిటిషన్ లు మరియు పిల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్)లు ఫైల్ చేసి పోరాటం చేస్తున్నాం.
* దాదాపు 5000 మంది పైగా వ్యక్తులను ఘర్ వాపసీ అనే కార్యక్రమం ద్వారా ఇతర మతాలలో జేరిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకు వచ్చాం.
* 1000 కి పైగా టీవీ డిబేట్ లలో పాల్గొని అన్ని విషయాలలో ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే మా హిందూ జనశక్తి యూ ట్యూన్ ఛానల్ లో దాదాపు 2100 వీడియోల ద్వారా కూడా ప్రజలలకు అన్ని విషయాలలో అవగాహన కల్పిస్తున్నాం. దాదాపు 200 మంది కి పైగా అమ్మాయిలకు లవ్ జిహాద్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించి వారిని వెనక్కు తీసుకొచ్చాం.