Hindu Fest: మార్చి 22న హిందూ ఫెస్ట్

అమెరికాలోని ఆధ్యాత్మికవాసుల కోసం టీవీ 5 (TV5) ఛానల్ వారి ‘‘హిందూ ధర్మం యు.ఎస్.ఏ మరియు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆధ్వర్యంలో హిందూ ఫెస్ట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో తెలుగు కమ్యూనిటీ నాయకులైన జయరాం కోమటి, ప్రసాద్ గారపాటి, జగదీశ్ ప్రభల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
మార్చి 22వ తేదీన ఉదయం 8 నుంచి 9 వరకు ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. కొలంబస్ ఒహాయోలోని ప్లెయిన్ సిటీ, సుప్రీం ఎరినా 9525లో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వేద మంత్రోచ్ఛారణలతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రుద్రసూక్తం, విష్ణు సహస్రనామస్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్పత్తులు మరియు సేవలను అందించే సంస్థలతో బూత్ లను ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్ కూడా తిలకించవచ్చు. ఆర్గనైజర్లుగా జగదీశ్ ప్రభల, ప్రసాద్ గారపాటి, జయరామ్ కోమటి, అడ్వయిజర్లుగా చంద్రమౌళీ శర్మ, నరేశ్ ఇందూరి, మహేష్ తన్నీరు, తేజోవట్టి, కేశవ్ రెడ్డి, మన్నె నాగేశ్వరరావు, కో ఆర్డినేటర్లుగా శ్రీనివాస్ పండ్రంగి, సుధీర్ గడ్డం, గణేశ్ వాత్యం, రమేష్ మధు, రామచందర్ రేవూరు, టిపి రెడ్డి, రామ్ మంద, చైతన్య శర్మ, సురేష్ ముఖిరాల, సహస్ర కుంకుమార్చన కో ఆర్డినేటర్స్‌గా సుష్ ఉప్పుటూరి, పవిత్ర కోట, ఉమ మునగాల, శిరీష బుధవర్తి, మీడియా, ఆపరేషన్స్ ప్రతినిధులుగా సౌజన్య పర్నంది, రాజ బొమ్మన ఉన్నారు.
మార్చి 28 నుండి ప్రారంభమయ్యే శనిదేవుని వక్రి నడక సమయంలో అన్ని రాశుల వారు కూడా సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో శతశర లింగార్చన వ్రతం ఆశీర్వాదాలు మరియు రక్షణను అందిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు హిందూ ధర్మం టీవీ యు.ఎస్.ఏ మరియు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం బృందం ఆధ్వర్యంలో శతసహస్ర లింగార్చనను నిర్వహిస్తున్నారు. అమెరికాలో మొట్టమొదటి సారిగా ఈ లక్ష లింగార్చన జరుగుతోందని, 121,100 శివలింగాలకు జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు, సహస్ర కుంకుమార్చన: వేయి కుంకుమార్పణలతో కూడిన కార్యక్రమాన్ని వీక్షించాలని నిర్వాహకులు కోరారు. ఈ హిందూ ఫెస్ట్‌లో భాగంగా మ్యూజిక్, యోగ వర్క్ షాప్ లను కూడా ఏర్పాటు చేశారు. ఈ పూజలను బ్రహ్మశ్రీ చంద్రమౌళీ శర్మ పర్నండి, వారి బృందం నిర్వహిస్తున్నది.
మరింత సమాచారం కోసం ఫ్లయర్‌ను కూడా చూడవచ్చు.
ఇతర వివరాల కోసం సంప్రదించండి
జగదీశ్ ప్రభల: 614 783 6614 సౌజన్య పర్నంది: 614 973 0384 ప్రసాద్ గారపాటి: 571 752 2622