GTA: జీటీఏ మెగా కన్వెన్షన్ బోర్డు మీటింగ్ విజయవంతం
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఏటేటా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజానీకానికి సేవ చెయ్యడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన జీటీఏ ఎల్లలు దాటుతోంది. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారైలు.. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ లో భాగమవుతూ.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ముందుకు సాగుతున్నారు. ప్రతి సంవత్సరం లాగా 2025 డిసెంబర్ లో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మొదటి ప్రపంచ మెగా కన్వెన్షన్ ను నిర్వహించబోతుంది. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్ గండిపేట్ లోని అక్షయ కన్వేన్షన్ లో 33 జిల్లాల అడ్వైజరి చైర్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్ అందరి తో ఇటీవల బోర్డు మీటింగ్ ను ఏర్పాటు చేశారు. జీటీఏ ఫౌండర్ అండ్ ఛైర్మన్ మల్లారెడ్డి ఆలుమల్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జీటీఏ ఇండియా ప్రెసిడెంట్ పాడూరు శ్రీనివాసరెడ్డి, కో ఫౌండర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభిషేక్ రెడ్డి కంకణాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మంజులరావు జూపల్లి, వాషింగ్టన్ డీసి అధ్యక్షుడు మరియు గ్లోబల్ మీడియా చైర్ రామ్ ముండ్రాతితో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీటీఏ అడ్వయిజర్ విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిన్నర కిందట మల్లారెడ్డి కాల్ చేసి కలుద్దాం అన్నారు. అప్పుడు జీటీఏ గురించి చెప్పారు. నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందని అన్నారు. మనం అమెరికాకు వెళ్లడం కాదు.. అక్కడ ఉన్న ఎన్నారైలను తెలంగాణకు తీసుకురావడం అన్నారు. నాకు చాలా నచ్చింది. నన్ను ఇందులో భాగం చేసినందుకు థ్యాంక్స్ టూ మల్లారెడ్డి అన్న. ఈ నెల 27 మరియు 28 జరగనున్న జీటీఏ ఈ వెంట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని విజయేంద్ర రెడ్డి తెలిపారు.
జీటీఏ ఇండియా ప్రెసిడెంట్ పాడూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..తెలుగు ఆర్గనైజషన్స్ ఎన్నో ఉన్నాయి. మనం ఎందుకు పెట్టుకోకూడదు అని మల్లారెడ్డి గారు జీటీఏ ను స్టార్ట్ చేశారు. 33 జిల్లాల్లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా మన సభ్యులు ఉన్నారు. జీటీఏ ముఖ్య ఉద్దేశ్యం.. ప్రతి గ్రామంలో కనెక్టివిటి ఉండాలి. ప్రతి ఊరిలో సమస్యను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు దృష్టికి వెళ్తుంది. ఈ సమస్యలు తీర్చడమే జీటీఏ ముఖ్య ఉద్దేశమని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
జీటీఏ కో ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ చాలెంజెస్ ను మనమంతా కలసి క్లియర్ చేయ్యాలని జీటీఏ కో ఫౌండర్ అభిషేక్ రెడ్డి కంకణాల అన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనే పేరు వినడానికి చాలా అద్భుతంగా ఉందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్.. శోభ అన్నారు. జీటీఏ వ్యవస్థాపకుడు మల్లారెడ్డి ఇన్ని చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది.. ఎందుకంటే జీటీఏ పేరు ఉన్నంత సింపుల్ గా అయితే ఆర్గనైజేషన్ ను ముందుకు తీసుకెళ్లడం అనేది ఉండదు.. తన పడుతున్న శ్రమ నాకు ఇప్పుడిప్పుడు అర్ధమవుతోంది.. జీటీఏ ను విస్తరింపజేసేందుకు నేను కృషి చేస్తాన శోభా అన్నారు.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మంజుల బోర్డు మీటింగ్ లో కీలక ఉపన్యాసం చేశారు మనకు మనం సేవ చేసుకోవడం కాదు సమాజానికి ఏమి చేశాము అనేది కీలకమని పేర్కొన్నారు .. జిటిఎ ద్వారా ఆ బాధ్యతని మనం నెరవేర్చుకోగలం అని ఆమె తెలిపారు.
వాషింగ్టన్ డీసి అధ్యక్షుడు మరియు గ్లోబల్ మీడియా చైర్ రాము ముండ్రాతి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు మరియు సంస్థలు డిసెంబర్ 27, 28న జరుగబోయే మొదటి మెగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు అందుకు మనమందరం ఇష్టపడి కష్టపడి మొదటి మెగా జీటీఏ కన్వెన్షన్ ను పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకొందాము అని పిలుపునిచ్చారు.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ మల్లారెడ్డి ఆలుమల్ల మాట్లాడుతూ..విశ్వ వ్యాప్తమైన తెలంగాణ సమాజాన్నీ ఏకం చేయాలనే మహోన్నత ఆశయం , బలమైన సంకల్పంతో రూపుదిసుకున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తొలి కన్వెన్షన్ డిశంబర్ 27, 28 తేదీలలోహైదరాబాద్ లో ఘనంగా జరగబోతుందని, ఇంతమంది వెనుకుండి నడిపిస్తున్నారంటే చాల సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నారైలు రాజకీయంగా దూరంగా ఉన్న ..తమ మధ్య నిత్యం రాజకీయ చర్చలు జరుగుతాయని తెలిపారు డిస్ట్రిక్ట్ చాఫ్టర్లు మొదలుపెడతాం అనుకున్నాం.. ఆ డిస్ట్రిక్ట్ చాఫ్టర్లు మూడు నెలల్లోనే మంజుల గారి సపోర్ట్ తో ముప్పై మూడు జిల్లాలో ఏర్పాటయ్యాయి. మీరందరు మమ్మల్ని నమ్మి మాతో పాటు కలిసి నడవడానికి వచ్చారు మీ అందరికి చాల థాంక్స్ అని పేర్కొన్నారు. ఈ మీటింగ్కు పలుజిల్లాల నుంచి జీటిఎ ప్రతినిధులు హాజరయ్యారు.






