Jayaram Komati: లోకేష్ అమెరికా పర్యటనల్లో అందరూ పాల్గొనాలి.. జయరాం కోమటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికోసం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజెప్పేందుకు వీలుగా అమెరికా వస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అమెరికా పర్యటనలో అందరూ పాల్గొనాలని ఎన్నారై టిడిపి అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి (Jayaram Komati) కోరారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఎన్నారైలకు 6వ తేదీన డల్లాస్లో నిర్వహించే సమావేశం ద్వారా మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ సమావేశానికి అందరూ రావాలని ఆయన కోరారు. ఇప్పటికే అమెరికావ్యాప్తంగా ఉన్న ఎన్నారై తెదేపా కార్యకర్తలు ఈ సమావేశం విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 3వ తేదీ నుండి తాను డల్లాస్లో అందుబాటులో ఉంటానని జయరాం తెలిపారు. అలాగే 8,9 తేదీల్లో కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అవుతారని కూడా మంత్రి జయరాం చెప్పారు.






