Penamaluru NRIs: అయ్యప్పస్వామి అన్నసమారాధనకు పెనమలూరు ఎన్నారైల విరాళం
 
                                    పుట్టి పెరిగిన గ్రామంలో నిర్వహించనున్న ధార్మిక కార్యక్రమానికి పెనమలూరు ఎన్నారైలు (Penamaluru NRI) చేయూతను అందించారు. పెనమలూరు గ్రామములో ఈ సంవత్సరం 2025,జనవరి 26న ఆఖరి ఆదివారం జరుగు 45వ అయ్యప్పస్వామి(Ayyappa Swamy) అన్నసమారాధన కార్యక్రమానికి పెనమలూరు ఎన్నారైలు(అమెరికా) అన్నదానానికి అవసరమైన బియ్యమునకు రూ.1,94,550లు అమెరికాలో సేకరించి స్వగ్రామానికి పంపారు. ఈ మొత్తాన్ని ఎన్నారై స్థానిక ప్రతినిధులు గురువారం నాడు కార్యక్రమ నిర్వాహకులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై స్థానిక ప్రతినిధులు మోర్ల నరేంద్ర బాబు, కిలారు ప్రవీణ్, పాలడుగు సుధీర్, అయ్యప్పస్వామి అన్నసమారాధన కమిటీ సభ్యులు ముప్పాళ్ల పూర్ణ చంద్రరావు(చిన్ని), జాస్తి పూర్ణరావు, దాసరి సాంబ, చాగంటిపాటి అల్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.











