హెచ్ 1బీ వైద్యులకు అమెరికా సర్కారు వెసులుబాటు
హెచ్ 1బీ వీసాలపై ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందించేందుకు అనుమతిస్తూ అమెరికా ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య నిపుణులు కొరతను అధిగమించేందుకు ఇది దోహదపడుతుందని భావించింది. మరో వైపు ఉద్యోగం లేని హెచ్ 1బీ దంత వైద్యులకు అమెరికాలో ఉండేందుకు ఇచ్చే 60 రోజుల వెసులుబాటును 180 రోజులకు పెంచాలని అమెరికన్ దంత వైద్యుల సంఘం (ఏడీఏ) వ్ఞిప్తి చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దంత వైద్యశాలలను మూసేశారు.






