అమెరికాలో హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం
అమెరికాలో మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. అమెరికా ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫిజర్.. జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థతో కలిసి వైరస్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. నాలుగునెలల్లోనే మేము మానవులపై ప్రయోగాల దశకు చేరుకున్నాం అని ఫిజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. సోమవారం మొదటి వలంటీర్‌పై వ్యాక్సిన్‌ను ప్రయోగించినట్టు చెప్పారు. మరో ఫార్మాస్యూటికల్ దిగ్గజం రీజనరేషన్ కరోనా రోగులకు చికిత్స అందించేందుకు యాంటీబాడీ చికిత్సను అభివృద్ధి చేశామని ప్రకటించింది. దీనిని జూన్‌లో మానవులపై ప్రయోగిస్తామని తెలిపింది. ఇప్పటికే గిలీడ్ సంస్థ తన యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ సమర్థంగా పనిచేస్తున్నదని ప్రకటించింది.






