కరోనా వ్యాప్తి గుట్టురట్టు
కరోనా వైరస్ మనుషుల్లో వేగంగా వ్యాపించడానికి గల ఓ ముఖ్య కారణాన్ని అమెరికాలోని కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా కుటుంబంలో ఎన్నో రకాల వైరస్లు ఉన్నాయి. వాటితో పోల్చితే కొవిడ్ 19లోని కడ్డీల లాంటి స్పైక్ ప్రోటీన్లలో ఓ నిర్మాణాత్మక తేడా ఉన్నట్లు గుర్తించారు. ఆ తేడా ఉన్న భాగమే మనుషుల శరీర కణాల్లోకి వైరస్ అతిసులువుగా ప్రవేశించానికి కారణమవుతోందన్నారు. స్పైకో ప్రొటీన్లో నిర్మాణాత్మక తేడా ఉన్న ప్రాంతం లోని నాలుగు అమైనో యాసిడ్ల క్రమాన్ని అధ్యయనం చేసిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ విభిన్న స్పైక్ ప్రొటీన్లే మనుషుల్లో వ్యాపిస్తున్న కరోనాను ఆ కుటుంబంలోని ఇతరత్రా వైరస్ల కంటే భిన్నంగా మార్చేశాయని శాస్త్రవేత్త గ్యారీ విటేకర్ వెల్లడించారు. అయితే నిర్మాణం, లక్షణాలపరంగా కొవిడ్ 19కు దగ్గరి పోలికలు ఉన్న వైరస్లలో సార్స్- కరోనా (2003), హెచ్సీఓవీ-హెచ్కేయూ1 (ఎలుకల ద్వారా వ్యాపించే వైరస్) ఉన్నట్లు తెలిపారు. ఆ రెండు వైరస్ల గణాల కలయికగా కరోనా ఉందన్నారు.






