భారత్ బయోటెక్, థామస్ జెఫర్సన్ ఒప్పందం
కొత్త కరోనా టీకా అభివృద్ధి, తయారీకి ఫిలడెల్ఫియాలోని థామస్ జెఫర్సన్ విశ్వవిద్యాలయంతో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. జెఫర్సన్ కనుగొన్న ఆ టీకాను భారత్ బయోటెక్ మరింత అభివృద్ధి చేసి తయారీ, మార్కెటింగ్ చేస్తుంది. డీయాక్టివేటెడ్ రాబిస్ వ్యాక్సిన్ను వినియోగించి వ్యాక్సిన్ రూపొందిచారు. ఒప్పందం ప్రకారం అమెరికా, యూరప్, జపాన్, తదితర దేశాలను మినహాయించి ప్రపంచ వ్యాప్తంగా కొత్త వ్యాక్సిన్ను తయారు చేసి విక్రయించడానికి కంపెనీకి లైసెన్స్ హక్కులు ఉంటాయని భారత్ బయోటెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ మోహన్ తెలిపారు. డిసెంబరు నాటికి దీనిని మావవులపై ప్రయోగించే అవకాశం ఉన్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది.






