New Zealand: న్యూజిల్యాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ‘బంగారు బతుకమ్మ’ (Bathukamma) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు తెలంగాణ ధూమ్ ధాం వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, ప్రముఖ గాయని స్ఫూర్తి జితేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ తెలంగాణ ఉద్యమ పాటలతో, స్ఫూర్తి జితేందర్ బతుకమ్మ (Bathukamma) పాటలతో అక్కడ ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలను అలరించారు. ప్రవాస ఆడబిడ్డలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, గౌరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రసమయి బాలకిషన్ తొలిసారి న్యూజిలాండ్ సందర్శించడంతో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాసులు ఆయనతో కలిసి ఫొటోలు దిగి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ బతుకమ్మ (Bathukamma) కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ నాయకులు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్, రోహిత్ రెడ్డి తమ్మినేని, ధర్మందర్ అల్లే, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్లతో పాటు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు విశ్వనాథు బాల, విజేత యాచమనేని, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, విశ్వనాథ్ అవిటి, రవి కుమార్ వట్టం, శశికాంత్ గున్నల, రమేష్ మెరుగు, విజయ్ శ్రీరామ్, మధు ఎర్ర, కిరణ్మయి, శైలజ బాలకుల్ల, రమేష్ రెడ్డి రామిండ్ల, హరీష్, శ్రీనివాస్ గాజుల, కిరణ్ కుమార్ కొమ్ముల, సందీప్ నాగుల, ప్రమోద్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.