Bathukamma: లండన్‌లోని లూటన్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

లండన్‌లోని లూటన్ పట్టణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ (Bathukamma) సంబరాలు ఘనంగా జరిగాయి. లూటన్ తెలుగు అసోసియేషన్ (LTA) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అక్కడి ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో (Bathukamma) మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో పూలను పూజిస్తూ, గౌరమ్మను ఆరాధించారు. కేవలం లూటన్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, ఖతర్, యూఏఈ, యూకే వంటి పలు దేశాల్లోని తెలుగు ప్రవాసులు కూడా బతుకమ్మ (Bathukamma) సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మలను (Bathukamma) అందంగా అలంకరించిన వారికి బహుమతులు అందజేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ (Bathukamma) సంబరాలతో పాటు వివిధ రకాల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా లూటన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు అందరికీ బతుకమ్మ (Bathukamma) శుభాకాంక్షలు తెలిపారు.