Hindu Temples: అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు

అమెరికా(America) లో హిందూ దేవాలయాల(Hindu Temples) పై ముష్కరులు చేస్తున్న దుశ్చర్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవల కాలిఫోర్నియా (California) లోని బిఎపిఎస్ హిందూ దేవాలయాన్ని ముష్కరులు అపవిత్రం చేశారు. కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ మందిర్‌ను భారత వ్యతిరేక గ్రాఫిటీతో అపవిత్రం చేశారు. 2022 నుండి ఇప్పటి వరకు అమెరికాలో హిందూదేవాలయాలపై జరిగిన దాడులపై అక్కడి న్యాయవాద బృందం ఓ నివేదికను వెల్లడించింది.
3 ఆగస్టు 2022, 16 ఆగస్టు 2022న నూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న శ్రీ తులసీ మందిర్ పై దాడి జరిగింది.
30 అక్టోబర్ 2023న కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటోలో ఉన్న హరి ఓం రాధా కృష్ణ మందిర్.
23 డిసెంబర్ 2023న నెవార్క్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ దేవాలయం.
1 జనవరి 2024న శాంతాక్లారాలో ఉన్న శివదుర్గ దేవాలయం.
5 జనవరి 2024న ఫ్రీమాంట్‌లోని శ్రీ అష్ట లక్ష్మి ఆలయం.
5 జనవరి 2024న హేవార్డ్‌లోని విజయ్ షెరావాలి టెంపుల్.
11 జనవరి 2024న డబ్లిన్‌లోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం.
17 సెప్టెంబర్ 2024న న్యూయార్క్ మెల్విల్లేలోని శీ స్వామినారాయణ మందిర్.
25 సెప్టెంబర్ 2024న శాక్రమెంటోలోని స్వామినారాయణ మందిర్, శాక్రమెంటో, కాలిఫోర్నియా.
8 మార్చి 2025న చినో హిల్స్‌లోని బిఎపిఎస్ ఆలయంపై దుండగులు దుశ్చర్యలకు పాల్పడ్డారు.
ఈ దాడులను ఇప్పటికే భారత విదేశాంగ కార్యాలయం, హిందూమహాసభ, ఇతర హిందూ నాయకులు ఖండిరచారు. ట్రంప్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు కోరారు.