TAMA: అట్లాంటా తెలుగు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
అట్లాంటా: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాలలో ఒకటైన అట్లాంటా తెలుగు సంఘం (TAMA) తమ 2026 కార్యవర్గ కమిటీని ప్రకటించింది. సంస్థ అధ్యక్షురాలిగా సునీత పొట్నూరు బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థ, ప్రవాస తెలుగు వారి కోసం విద్య, సాంస్కృతిక, సేవా రంగాలలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ నూతన బృందం సిద్ధమైంది.
కార్యవర్గ సభ్యుల వివరాలు..
ప్రెసిడెంట్ ఎలక్ట్: తిరు చిల్లపల్లి
జనరల్ సెక్రటరీ: సునీల్ దేవరపల్లి
ట్రెజరర్: సత్య నాగేందర్ గుత్తుల
కల్చరల్ సెక్రటరీ: కృష్ణ ఇనపకుతిక
ఎడ్యుకేషన్ సెక్రటరీ: నరేంద్ర బాబు నల్లూరి
మీడియా సెక్రటరీ: చలమయ్య బాచు
టెక్నాలజీ సెక్రటరీ: ముఖర్జీ వేములపల్లి
స్పోర్ట్స్ & యూత్ సెక్రటరీ: హరికృష్ణ అద్దంకి
కమ్యూనిటీ సర్వీసెస్ సెక్రటరీ: శ్రీనివాస్ రామానధం
ఉమెన్ సర్వీసెస్ సెక్రటరీ: పార్వతి కొంపెల్ల
ఈవెంట్ సెక్రటరీ: చైతన్య కొర్రపాటి
లిటరరీ సెక్రటరీ: శేఖర్ కొల్లు
అట్లాంటాలోని తెలుగు కమ్యూనిటీకి అండగా ఉంటూ, భాషా సంస్కృతుల పరిరక్షణకు ఈ టీమ్ కృషి చేయనుంది. మరిన్ని వివరాల కోసం www.tama.org వెబ్సైట్ను సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.






