ATA: డల్లాస్‌లో ఘనంగా ఆటా మాతృ దినోత్సవ వేడుకలు
డల్లాస్‌లో ఆటా (ATA) ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. డల్లాస్ (Dallas) ఆటా మహిళా బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆనందోత్సాహభరితమైన కార్యక్రమాలు అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా చిక్కుముడులు, మ్యూజికల్ చైర్స్, బింగో వంటి సరదా ఆటల్లో పాల్గొన్నారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని, తల్లుల కోసం ప్రత్యేకంగా వంటల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో తల్లులు తమ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విజేతలకు అద్భుతమైన బహుమతులు అందజేశారు. కేక్ కటింగ్ వేడుకతో కార్యక్రమం సంతోషకరమైన వాతావరణంలో ముగిసింది, ఇది నిజంగా చిరస్మరణీయమైన వేడుకగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానిక ఆటా నాయకత్వం, అంకితభావం కలిగిన డల్లాస్ ఆటా కమిటీల అసాధారణ సమన్వయం, సునిశితమైన ప్రణాళిక మరియు నిరంతర కృషి కారణమని చెప్పవచ్చు.
ఆటా ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శారద సింగిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రఘువీర్ మారిపెద్ది, మరియు రీజినల్ కోఆర్డినేటర్లు స్వప్న తుమ్మపాల, శ్యామ్ మాలసాల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మరియు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆటా కమిటీ చైర్‌లు, కో-చైర్‌లు, సలహాదారులు, డైరెక్టర్లు మరియు సభ్యులైన మహేందర్ గణపురం, అర్పిత ఓబులరెడ్డి, శ్రీనివాస్ కల్లూరి, సత్య పాకారి, సుమన బీరం, నీరజ పైడిగెల, సుమ ముప్పాల, వరూధిని మిట్టా, లక్ష్మి పోరెడ్డి, సంతోషి మజ్జిగ, శ్రీనివాస్ రెడ్డి కేలం, హరిత కేలం మరియు మాధవి మెంటా వంటి వారి కృషి ఈ కార్యక్రమం నిర్దోషంగా అమలు కావడానికి మరియు ఉత్సాహభరితమైన వాతావరణానికి ఎంతగానో దోహదపడిరది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కిషోర్ గూడూరు మరియు నాష్‌విల్లే, టిఎన్ నుండి నరేందర్ నూకాల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులకు, ప్రముఖులకు, ఇతరులకు ఆటా డల్లాస్ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.







