Rammohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి కుమారుడి బారసాల, నామకరణోత్సవం
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడి (Rammohan Naidu) కుమారుడి బారసాల, నామకరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖుల సమక్షంలో రామ్మోహన్‌నాయుడు తన కుమారుడికి శివాన్ ఎర్రన్నాయుడి (Sivan Errannayuda) గా నామకరణం చేశారు. తన అధికార నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్‌దీప్‌సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజూ, జ్యోతిరాదిత్య సింథియా, అశ్వినీ వైష్ణవ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఢల్లీి ముఖ్యమంత్రి రేఖ గుప్త, ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఢల్లీి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రామ్మోహన్ నాయుడి మామ, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.







