Home Minister Anita: ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : హోంమంత్రి అనిత
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, ఆధునిక సాంకేతికత సాయం తో ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Anita) తెలిపారు. తుపాను సన్నాహక చర్యలపై తాడేపల్లి (Tadepalli) లోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం లో ఆమె అధికారులతో సమీక్షించారు. సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ (Prakhar Jain) పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వాయుగుండం గమనాన్ని వివరించారు. జిల్లాలవారీగా ప్రభావిత ప్రాంతాలు, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ప్రజలు (People) ఆందోళన చెందవద్దని, అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. గంటకు 100 కి.మీ.కు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నష్టం జరగకుండా చర్యలు తీసకుంటున్నాం అని పేర్కొన్నారు.







