Jubilee Hills: జూబ్లీహిల్స్ ప్రచారానికి.. సీఎం రేవంత్‌రెడ్డి
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ (Naveen Yadav) ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఆయన, స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని యూస్‌ఫగూడ పోలీస్ గ్రౌండ్స్ (Police Ground) లో ఈ నెల 28న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి అభినందన సభ జరగనుంది. ఆయనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Tummala Nageswara Rao) నూ సన్మానించనున్నారు. ఆ సభలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ నెల 30, 31 తేదీల్లోను మళ్లీ నవంబర్ 4, 5 తేదీల్లోనూ సీఎం రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనకు ఈ ఉప ఎన్నిక కొలమానంగా మారడం, ఇక్కడ గెలిస్తే దాని ప్రభావం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనా పడే అవకాశమున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.







