కొండపల్లిలో ఆటా వైద్యశిబిరం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో ఇఎన్టి, కంటి చికిత్స వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్యశిబిరానికి 250 మందికిపైగా గ్రామస్తులు వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ఆటా వేడుకలు చైర్, ప్రెసిడెంట్ ఎలక్ట్ జయంత్ చల్లా, ఆటా 18వ మహాసభల కన్వీనర్ కిరణ్ పాశం, టిడిఎఫ్ నాయకురాలు కవితా చల్లా, సిహెచ్. నరసింహరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సేవలందించిన డాక్టర్లకు మెమోంటోలను వారు అందజేశారు. ఆటా ఇండియా టీమ్ నాయకులు అమ్రీత్ ముళ్ళపూడి, సూర్య చంద్రారెడ్డి ఈ వైద్యశిబిరం విజయవంతానికి సహకరించారు. ఆటా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్, మీడియా చైర్ భాను స్వర్గం ఈ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.







