వీడియో జర్నలిస్టులకు సహాయం చేసిన ఆటా
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో వీడియో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రెసిడెంట్ పరమేశ్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ భువనేశ్ బూజాల, ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి సహకారంతో ఆటా ఇండియా ప్రతినిధి ఆర్టిస్ట్ లోహిత్ కుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని ఆటా తరపున నిర్వహించారు. టీవీజెఎ కమిటీ సహకారంతో చాలామంది వీడియో జర్నలిస్టులకు సహాయాన్ని అందించినట్లు లోహిత్కుమార్ తెలిపారు. 25 కేజీల బియ్యం, 2కేజీల నూనె, 2 కేజీల చక్కెర, 2కేజీల గోధుమ పిండి, 2 కేజీల కందిపప్పు అందించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, ఆటా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.






