ATA: చికాగోలో ఘనంగా ఆటా బతుకమ్మ 2025 వేడుకలు

మిడ్‌వెస్ట్‌లో అతిపెద్ద వేడుక విజయవంతం
అమెరికన్ తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో ఇల్లినాయిలోని ఆరోరా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మిడ్‌వెస్ట్‌లో అతిపెద్ద బతుకమ్మ వేడుక 2025ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 600 మందికి పైగా ప్రజలు పాల్గొన్న ఈ వేడుక, చికాగో ప్రాంతంలోని తెలుగు కమ్యూనిటీకి అత్యంత వైభవంగా జరిగిన సాంస్కృతిక సమ్మేళనాలలో ఒకటిగా నిలిచింది. సంప్రదాయ పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి గొప్పదనాన్ని, అందాన్ని చాటిచెప్పే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రంగుల సాంప్రదాయ చీరల్లో అలంకరించుకున్న మహిళలు అద్భుతంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఉల్లాసంగా పాటలు పాడుతూ, మహిళలు నాన్-స్టాప్ బతుకమ్మ ఆటలు ఆడారు. కోలాటం వేడుక కూడా ఆకట్టుకుంది. ఈ వేడుక కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక నిజమైన కమ్యూనిటీ సమావేశం ఇది. తెలంగాణను చికాగోలో ప్రతిబింబిస్తూ, కుటుంబాలు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులను ఏకం చేసింది.
ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్తలు శిరీష వీరపనేని, సుచిత్ర రెడ్డి, సైన నర్వాడే, సారికా రెడ్డి శెట్టిలు విజయవంతమయ్యేలా కృషి చేశారు. వారి అంకితభావం, కృషి ఈ వేడుక విజయవంతంగా, ఉల్లాసభరితంగా జరగడానికి దోహదపడిరది. స్థానిక ఆటా నాయకులు ఆటా కార్యదర్శి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ట్రస్టీలు వెన్ రెడ్డి, ఆర్వీ రెడ్డి, ప్రాంతీయ కోఆర్డినేటర్లు రాజ్ అడ్డగట్ల, పురుషోత్తం రెడ్డి, హనుమంత్ రెడ్డి, కేకే రెడ్డి, సత్య కందిమల్ల, కరుణాకర్ మాధవరం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టాండిరగ్ కమిటీ సభ్యులు నరసింహ చిట్టలూరి, మెలోడీ మహేష్ కుమార్, లక్ష్మణ్ రెడ్డిశెట్టి, నరేంద్ర రెడ్డి వజ్రాల, వరుణ్ కంచర్ల, వీరన్న పంజాల, అమర్ నెట్టం, మరియు జానకిరాం రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ వేడుకలో ట్రస్టీ మహీధర్ ముస్కుల మరియు కమిటీ సభ్యులు మహిపాల్ రెడ్డి వంచా, మరియు వెంకట్ తూడి కూడా పాల్గొన్నారు.
రెలారే గాయని శాలిని ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించడం ఈ వేడుకను మరింత మరపురానిదిగా చేసింది. ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.