Indian Students: 2023 లో వీసా గడువు పట్టించుకోని 7000 మంది భారతీయ విద్యార్దులు
ఒక్క 2023 సంవత్సరం లోనే. దాదాపు 7000 మంది భారతీయ విద్యార్దులు తమ వీసా గడువు పట్టించుకోకుండా గడువు దాటక కూడా అమెరికా లో వున్నారని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సంస్థ అధికారిణి జెస్సికా వాగన్ అన్నారు. ఈ మధ్యనే జరిగిన “Restoring Immigration Enforcement in America ” సమావేశం లో మాట్లాడుతూ అన్ని దేశాల నుంచి విజిటింగ్ వీసా మీద వచ్చే విజిటర్స్, స్టూడెంట్ వీసా మీద వచ్చే స్టూడెంట్స్ తమ వీసా గడువు దాటక కూడా వుంటారని చెప్పారు. 2023 లో ఇలా గడువు దాటాక కూడా అమెరికా వీడని భారతీయుల సంఖ్య దాదాపు గా 7000 వుందని ఆమె ఆ సమావేశం లో తెలిపారు. ఈ విధంగా 2023 లో ఇంకో 4 దేశాల వారుకూడా వున్నారని, వారు 2000 లోపలే వుంటారని, ఇండియా ఈ లిస్ట్ లో టాప్ లో వుందని జెస్సికా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భం గా జెస్సికా మాట్లాడుతూ ఈ సమస్య నివారణ గా విద్యార్దులు, విజిటర్స్ దగ్గర నుంచి వచ్చే సమయం లోనే Purpose of Intent ( ఎందుకు వచ్చారో తెలిపే ప్రమాణ పత్రం) తీసుకోవాలని సూచించారు.







