Telusu Kada: ‘తెలుసు కదా’ యూత్, ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్టైనర్: సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, ఎస్ థమన్, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘తెలుసు కదా’ (Telusu Kada) రొమాంటిక్ & ఇంటెన్స్’ ట్రైలర్ లాంచ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ కమింగ్-ఆఫ్-ఏజ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ టీజర్, రెండు పాటలతో సంచలనాన్ని సృష్టించింది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోనైస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్‌లో సిద్ధు “పవర్, కంట్రోల్ తన చేతిలోనే ఉండాలి” అని నమ్మే వ్యక్తిగా కనిపించారు. ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్షిప్ చిక్కుకుపోయిన అతని జీవితం, ఆ తర్వాత ఎమోషనల్ రైడ్ ని అందిస్తోంది.
ఈ కథ కేవలం లవ్ ట్రయాంగిల్ మాత్రమే కాదు..ఇది మేల్ ఇగో, మోడరన్ ఎమోషన్ పై ఎమోషనల్ అడ్వంచర్ గా వుంది. రచన, దర్శకత్వం రెండింటిలోనూ నీరజ కోన ఆకట్టుకున్నారు. డైలాగులు శక్తివంతంగా, లోతైన భావంతో వ్వున్నాయి. కథలో మెయిన్ ఎలిమెంట్ నేటి సమాజంలో చర్చనీయాంశమైన ఒక సెన్సిటివ్ టాపిక్ చుట్టూ తిరుగుతుంది.
సిద్ధు జొన్నలగడ్డ వన్ మాన్ షో అనిపించేంతగా తన నటన ఆకట్టుకున్నారు. కంట్రోల్, ఈగో, ఎమోషన్స్ తో కూడిన తన నటన నెక్స్ట్ లెవల్ లో వుంది. వైవా హర్షాతో జరిగే డైలాగ్స్ అతని కాన్ ఫ్లిక్ట్ ని చక్కగా చూపించాయి. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఇంటెన్సిటీ అదిరిపోయాయి.
శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలతో సిద్ధు కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. వైవా హర్షా తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రండ్ పాత్రలో మెప్పించారు.
టెక్నికల్ టీమ్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కి రిచ్ నెస్ తీసుకొచ్చింది. థమన్ ఎస్. అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది.
నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌తో టెక్నికల్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా మెరిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్యాలిటీలో వున్నాయి.
“తెలుసు కదా” కేవలం యువతకే కాదు, కుటుంబ ప్రేక్షకుల మనసునూ తాకే ఎమోషనల్ లేయర్స్ ఉన్న చిత్రం . ప్రేమ, ఈగో, ఆత్మపరిశీలన, మోడరన్ రిలేషన్షిప్స్ మేళవించిన ఈ సినిమా సోల్, స్టైల్, సబ్‌స్టెన్స్ కలిగిన మోడర్న్ లవ్ స్టోరీగా గుర్తుండిపోతుంది. ఈ దీపావళికి సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఒక ఎమోషనల్, మ్యూజికల్, రొమాంటిక్ రైడ్‌కి గెట్ రెడీ.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆడియన్స్ ఎక్సైట్మెంట్, రెస్పాన్స్ కి థాంక్యూ. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ తో ఒక్కసారిగా ఆడియన్స్ కి బ్యాంగ్ లాంటిది ఇవ్వాలని ముందే డిసైడ్ అయ్యాం. ట్రైలర్లో ఏం చూసారో సినిమాలో కూడా అదే క్యారెక్టర్, టోన్ కనిపిస్తుంది. టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. టిల్లు ఇన్నోసెంట్. బట్ తెలుసు కదా అలా కాదు. ఇంటెలిజెంట్ క్యారెక్టర్. వరుణ్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇది యూత్ కి ఫ్యామిలీస్ కి నచ్చే సినిమా
హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీ అందరి రెస్పాన్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇది ఒక రాడికల్ సినిమా అవుతుంది. ట్రైలర్ చూసి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత టిల్లుని మరిచిపోతారు. అంత నమ్మకం ఉంది. డైరెక్టర్ నీరజ గారికి, హీరో సిద్దు గారికి మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా రాడికల్ గా అనిపించింది. సినిమా కోసం నేను చాలా ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్నాను. మా టీమ్ అందరికీ థాంక్యూ.
డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నా ఫస్ట్ ఫిలిం. చాలా స్పెషల్. మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా స్పెషల్. ట్రైలర్లో మీరు చూసిన దానికి పది రెట్లు సినిమాలో ఉంది. గెట్ రెడీ ఫర్ ఫన్ రైడ్. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.
వైవా హర్ష మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ట్రైలర్లో కొంచెమే చూపించాము. సినిమాలో చాలా ఉంది. అక్టోబర్ 17 అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుసు కదా చాలా స్పెషల్ ఫిలిమ్. ఈ కథ వినగానే నచ్చింది. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్న టీం విషయంలో ప్రౌడ్ గా వుంది. బిగ్ స్క్రీన్ మీద మీ అందరికీ సినిమా చూపించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాము .అక్టోబర్ 17న సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి కృతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు అద్భుతంగా పెరిగాయి. తప్పకుండా ఈ సినిమా థియేటర్స్ లో మిమ్మల్ని అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను. సినిమా సిద్దు గారి జానర్ లో ఉంది. కచ్చితంగా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది.