Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్

ఓ మంచి ప్రేమ కథను, అంతకు మించిన కుటుంబ విలువలు, ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న చిత్రం ‘బ్యూటీ’ (Beauty). జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ సినిమాని నిర్మించారు. అలాంటి ‘బ్యూటీ’ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. సెప్టెంబర్ 19న మూవీని విడుదల చేస్తున్న క్రమంలో తాజాగా ట్రైలర్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు.
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీని విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా యువ సామ్రాట్ నాగ చైతన్య తాజాగా బ్యూటీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. నాగ చైతన్య రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకుల మనసుని హత్తుకుంటుంది.
‘ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు’.., ‘నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా’ అంటూ హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేశారు. స్కూటీ కొనిస్తాను అని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్, ‘క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్ లా ఉండాలి గానీ కలెక్టర్ లా ప్రామిస్ చేయొద్దు’ అనే డైలాగ్ ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉంది.
ఈ ట్రైలర్ లోని డైలాగ్స్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్ డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఇక మ్యూజిక్, ఆర్ ఆర్, విజువల్స్ అయితే టాప్ నాచ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా, ఆర్ట్ డైరెక్టర్ గా బేబీ సురేష్ భీమగాని, ఎడిటర్ గా ఎస్బి ఉద్ధవ్ పని చేశారు. ఈ సినిమాకు బి.ఎస్.రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.