Nithin: విఐ ఆనంద్ తో నితిన్ మూవీ?

టాలీవుడ్ హీరో నితిన్(nithin) పరిస్థితి ఇప్పుడు అసలు బాలేదు. ఆయన సక్సెస్ అందుకుని చాలా ఏళ్లవుతుంది. అప్పుడెప్పుడు 2016లో అ..ఆ(A..Aa) సినిమా తర్వాతి నితిన్ నుంచి ఎన్నో సినిమాలు రాగా వాటిలో భీష్మ(Bheeshma) తప్ప మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లుగానే మిగిలాయి. ఈ ఇయర్ వచ్చిన రాబిన్ హుడ్(Robinhood), తమ్ముడు(Thammudu) సినిమాలు కూడా నితిన్ కు సక్సెస్ ను అందించలేకపోయాయి.
దీంతో నితిన్ మార్కెట్ బాగా డీలా పడిపోయింది. అందులో భాగంగానే ఆయన చేతుల్లోకి వచ్చిన సినిమాలు కూడా చేజారిపోతున్నాయి. తమ్ముడు మూవీ తర్వాత వేణు ఎల్దండి(venu yeldandi) దర్శకత్వంలో ఎల్లమ్మ(yellamma) చేస్తారనుకుంటే ఆ సినిమా పోయింది. ఇష్క్(Ishq) లాంటి హిట్టిచ్చిన విక్రమ్ కె.కుమార్(Vikram k kumar) దర్శకత్వంలో సినిమా అనుకుంటే అదీ ఆగిపోయింది. దీంతో నితిన్ తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.
ఈ టైమ్ లో నితిన్ ఓ టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ కథలతో సినిమాలను చేసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్(VI Anand) దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ఈ సినిమా అయినా నితిన్ కు సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.