Upasana: క్లీంకారను అలా చూడాలనుకుంటున్నా

రామ్ చరణ్(ram charan) భార్య ఉపాసన(Upasana) తన కూతురు విషయంలో సెలబ్రిటీలా కాకుండా ఓ సాధారణ తల్లిలానే ఆలోచిస్తుంది. సాధారణ తల్లులు ఎలాగైతే తమ పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో, వారికి ఎలాంటి మంచి ఆహారాన్ని అందిస్తారో ఉపాసన కూడా తన కూతురు క్లీంకార(Klin Kaara) విషయంలో అలానే ఉంటూ తనను మంచి ఆరోగ్యాన్ని అందించాలని చూస్తోందట.
సాధారణంగా సెలబ్రిటీలు వారి ఫ్యామిలీల్లో ఎక్కువగా పార్టీలు జరుగుతుంటాయి కాబట్టి పిల్లలు అందులో జంక్ ఫుడ్ కు అలవాటు పడే వీలుంటుంది. కానీ క్లీంకారకు ఆ ఛాన్స్ లేదంటుంది ఉపాసన. తనకు ఎంతో ఇష్టమైన రాగులుని, ఉపాసన తన కూతురికి కూడా అలవాటు చేసిందట. ప్రతీరోజూ క్లీంకారకు రాగుల్ని తినిపిస్తానని ఉపాసన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
నీ కూతురికి రోజూ ఏదో రూపంలో రాగుల్ని తినిపించు అని సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru Jaggi Vasudev) తనకు చెప్పారని, జగ్గీ వాసుదేవ్ కూతురు రాధే జగ్గీ(Radhe Jaggi) కూడా తన తండ్రి తమకు రెగ్యులర్ గా రాగి జావ తాగించేవారని, ఇప్పటికీ తాను ఆ అలవాటును కొనసాగిస్తున్నానని తనతో చెప్పిందని, దాని వల్లే రాధే చాలా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉందని, రాధే లానే క్లీంకారను కూడా హెల్తీగా, ఫిట్ గా ఉంచడానికే క్లీంకార డైట్ లో రాగుల్ని యాడ్ చేసినట్టు ఉపాసన చెప్పింది. ఉపాసన చెప్పిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.