Sree Vishnu: మళ్లీ పాత స్కూల్ కు శ్రీవిష్ణు

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(sree vishnu) కెరీర్ స్టార్టింగ్ నుంచి భిన్న కథలను ఎంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. అతను చేసిన ప్రయోగాల వల్లే శ్రీవిష్ణు కు ఇవాళ ఈ స్థాయి గుర్తింపు వచ్చింది. కెరీర్ మొదట్లో ఎక్కువగా సీరియస్ కథలను చేసుకుంటూ వచ్చిన శ్రీవిష్ణు, ఆ తర్వాత కామెడీ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.
శ్రీవిష్ణు ఎప్పుడైతే కామెడీ సినిమాలు చేయడం మొదలుపెట్టాడో అప్పట్నుంచి అతనికి వరుస సక్సెస్ లు వచ్చాయి. దీంతో కొంత కాలం పాటూ సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు ఈ టాలెంటెడ్ హీరో. బ్రోచేవారెవరురా(brochevarevarura), శ్వాగ్(swag), సామజవరగమన(samajavaragamana), సింగిల్(single) లాంటి కామెడీ సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించిన శ్రీవిష్ణు ఇప్పుడు తిరిగి తన పాత జానర్ కు వెళ్లాడు.
జానకిరామ్(janakiram) అనే కొత్త డైరెక్టర్ తో శ్రీవిష్ణు చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్(Comrade kalyan) సినిమా సీరియస్ కథాంశంతోనే తెరకెక్కుతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించడంతో పాటూ డ్యూయెల్ రోల్ కూడా చేస్తున్నాడట. అసలే నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు శ్రీ విష్ణు అలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం రిస్క్ అనే చెప్పాలి. మరి అతని రిస్క్ కు తగ్గ ఫలితాన్ని కామ్రేడ్ కళ్యాణ్ తో శ్రీవిష్ణు అందుకుంటాడేమో చూడాలి.