Peddi: పెద్ది సినిమాలో కిస్సిక్ బ్యూటీ
ఒకప్పుడంటే ఐటెం సాంగ్స్ చేయడానికి స్పెషల్ గా భామలుండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కాలంతో పాటూ ట్రెండ్ కూడా మారింది. ఐటెం సాంగ్స్ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కాగా, అందులో స్టార్ హీరోయిన్లే నటిస్తున్నారు. రెమ్యూనరేషన్, క్రేజ్, ఫాలోయింగ్ అన్నీ పెరుగుతాయనే ఆలోచనతో హీరోయిన్లు కూడా ఈ సాంగ్స్ చేయడానికి వెనుకడుగేయడం లేదు.
అందులో భాగంగానే పుష్ప(pushpa) సినిమాలో సమంత(samantha) ఊ అంటావా(Oo Antava) సాంగ్ చేసి మరింత పాపులరైతే, తర్వాత కిస్సిక్(kissik) అంటూ పుష్ప2(pushpa2) లో శ్రీలీల(sree leela) నటించి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది(peddi) సినిమాలో ఓ స్పెషల్ ఫోక్ సాంగ్ ఉందని ముందు నుంచి వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలోని స్పెషల్ ఫోకస్ సాంగ్ లో టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల(sree Leela) ను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. రామ్ చరణ్(ram charan) మంచి డ్యాన్సర్ కావడంతో శ్రీలీల అయితే అతడ్ని సరిగ్గా మ్యాచ్ చేయగలదని అందుకే ఆమెను ఎంపిక చేశారంటున్నారు. రీసెంట్ గా జూనియర్(junior) సినిమాలో వైరల్ వయ్యారి(Viral Vayyari) సాంగ్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీలీల మరి చరణ్ తో కలిసి ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.







