Sree Leela: శ్రీలీల స్టోరీ వెనుక కారణమిదే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) రీసెంట్ గా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో శ్రీలీల బుగ్గలకు పసుపు పూరి పలువురు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. శ్రీలీల ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ బిగ్ డే అంటూ మిగిలిన వివరాలు కమింగ్ సూన్ అంటూ హింట్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటోలను చూసిన వారంతా శ్రీలీలకు సైలెంట్ గా నిశ్చితార్థం అయిపోయిందని కామెంట్స్ చేశారు.
కానీ ఈ ఫోటోల వెనుక రీజన్ వేరే అని శ్రీలీల ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. జూన్ 14న శ్రీలీల బర్త్ డే. కానీ తిథుల ప్రకారం ఆ బర్త్ డేను శ్రీలీల కాస్త ముందుగానే జరుపుకుందట. ఎలాంటి ఈవెంట్ ను అయినా సాంప్రదాయ బద్ధంగా చేసే శ్రీలీల తల్లి తన కూతురి బర్త్ డే ను ఇలా తిథుల ప్రకారం జరపడంతో పాటూ దానికి ఇండస్ట్రీలోని పలువురిని ఆహ్వానించి అందరినీ షాకయ్యేలా చేసింది.
ఇక శ్రీలీల విషయానికొస్తే ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీల బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో డేటింగ్ లో ఉందని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారిందని అంటున్నారు. ఆ వార్తలకు తగ్గట్టుగానే శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ ఇంట ఏ ఫంక్షన్ జరిగినా ప్రత్యక్షమవుతుంది.