Jailer2: జైలర్2లో మరో టాలెంటెడ్ నటుడు?

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) రీసెంట్ గా కూలీ(Coolie) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే. కూలీ సినిమాకు మిక్డ్స్ టాకే వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే కూలీ తర్వాత రజినీ ప్రస్తుతం సాలిడ్ లైనప్ తో రెడీగా ఉన్నారు. అందులో భాగంగానే తలైవా జైలర్2(Jailer2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
బ్లాక్ బస్టర్ మూవీ జైలర్(Jailer)కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా జైలర్2 ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఇదిలా ఉంటే జైలర్2 సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
జైలర్2 నెక్ట్స్ షెడ్యూల్ లో టాలెంటెడ్ యాక్టర్ ఎస్‌జె సూర్య కూడా జాయినవనున్నట్టు తెలుస్తోంది. జైలర్2 లో ఎస్‌జె సూర్య(SJ Surya) నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna) కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని టాక్ ఉంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తోన్న జైలర్2కు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.