Panchumarthi Anuradha: వారంతా కటకటాల వెనక్కి వెళ్లక తప్పదు : పంచుమర్తి అనురాధ
వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) పెంచి పోషిస్తున్న పేటీఎం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తల్లి, చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననం చేయించారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం (Adulterated alcohol)తో 30 వేల మంది ప్రాణాలు తీసి ఎందరో తల్లులకు గుండెకోత మిగిల్చారని ఆరోపించారు. తప్పుడు పోస్టులు పెట్టించి జైలుకు పంపుతూ వారి తల్లిదండ్రులకు ఆవేదన మిగుల్చుతున్నారని మండిపడ్డారు. తమ పిల్లలతో జగన్ చేయిస్తున్న వికృత క్రీడ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy) లాంటి వాళ్లను ఎందరిని ప్రయోగించినా వారంతా కటకటాల వెనక్కి వెళ్లక తప్పదన్నారు.







