Chandrababu: విశాఖలో సీఐఐ సదస్సు : చంద్రబాబు
విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ (CII) సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈసారి సీఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరగనుందని పేర్కొన్నారు. ఇందులో ప్రజంటేషన్, ఎగ్జిబిషన్, ఎగ్జిక్యూషన్ ఒప్పందాలు జరుగుతాయన్నారు. పెట్టుబడుల సాధనలో లోకేశ్ (Lokesh) క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది. షిప్మెంటే మిగిలింది. గడువులోపే ఇది అమరావతి (Amaravati) కి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. పెండిరగ్లోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా మారాయి. 22 ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎమ్మెల్యేలు (MLAs) విధిగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సిందే. లోకేశ్ ఆదేశాలతో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారమయ్యేలా వ్వవస్థ ఏర్పాటు మా లక్ష్యం అని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారాలను చూపారు.







