మహేష్ ఫాన్స్ కు గుడ్ న్యూస్?

SSMB28 మూవీ స్పెషల్ అట్రాక్షన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయబోతున్న SSMB28 చిత్రం లో పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి నటిస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ మూవీలో ఆమె రోల్ ఏంటనే దానిపై ఓ కీలక అప్‌డేట్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం ఎవర్ గ్రీన్ బాలీవుడ్ భామను రంగంలోకి దించబోతున్నారట. ”అతడు, ఖలేజా” సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి అంచనాలను మించి ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నటీనటుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న ఆయన బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టికి కీలక పాత్ర ఇచ్చారని సమాచారం. 1993 లో బాజిగర్ చిత్రం తో అరంగ్రేటం చేసిన శిల్పా శెట్టి…. తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో సహస వీరుడు సాగర కన్య, మోహన్ బాబు తో వీడెవడండీ బాబు!, నాగార్జున తో ఆజాద్, బాలకృష్ణ తో భలేవాడివి బాసూ! చిత్రాలలో నటిచింది.
అయితే తాజాగా తెలిసిన సమాచారం మేరకు కథలో కీలకంగా ఉండే ఓ క్యారెక్టర్‌కు సాగర కన్య శిల్పా అయితేనే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన మాటల మాంత్రికుడు ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ మోడ్రన్‌గా ఉండటమే గాక హీరోతో పోటాపోటీగా ఉండనుందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్‌ని పెట్టి అట్రాక్ట్ చేసే త్రివిక్రమ్ ఇప్పటికే నదియా, ఖుష్బూ, దేవయాని, టబూ లాంటి తారలతో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు శిల్పాశెట్టిని తీసుకొస్తున్నారనే మాట మహేష్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ సరసన హీరోయిన్ కోసం వేట ప్రారంభించిన యూనిట్.. పూజా హెగ్డే, జాన్వీ కపూర్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్. అలాగే చిత్రంలోని మరో కీలకపాత్ర కోసం సుమంత్ యార్లగడ్డ ని తీసుకోవాలనుకుంటున్నారట. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ప్రస్తుతం నిలిపివేశారు.