Samantha: సొంత బ్యానర్ లో సమంత కంబ్యాక్ ఫిల్మ్?

ఒకప్పుడు తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన సమంత(samantha) హీరోయిన్ గా తెలుగులో సినిమా వచ్చి రెండేళ్లవుతుంది. విజయ్ దేవరకొండ(Vijay devarakonda)తో చేసిన ఖుషి(Kushi) సినిమా తర్వాత సమంత నుంచి మరో సినిమా వచ్చింది లేదు. రీసెంట్ గా నిర్మాతగా మారి సమంత నిర్మించిన శుభం(Subham) సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించినప్పటికీ ఆమె ఫ్యాన్స్ కు మాత్రం సమంత నుంచి ఎప్పుడెప్పుడు తెలుగు సినిమా వస్తుందా అని ఆతృతగా ఉంది.
అయితే ఇప్పుడు సమంత త్వరలోనే ఓ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాకు సమంత ఫ్రెండ్, డైరెక్టర్ నందినీ రెడ్డి(Nandini Reddy) దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఆల్రెడీ సమంత, నందినీ కలిసి గతంలో జబర్దస్త్(Jabardasth) తో పాటూ ఓ బేబీ(Oh Baby) అనే సినిమాలు చేయగా ఇప్పుడు వారిద్దరూ కలిసి తమ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
ఈ విషయంలో ఇప్పటికే సమంత, నందినీ మధ్య ముందస్తు చర్చలు జరుగుతున్నాయని, ఆ సినిమాను కూడా సమంత తన సొంత బ్యానర్ లోనే నిర్మించనుందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా సమంత ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్(Rakth Brahmand) లో నటిస్తున్న విషయం తెలిసిందే.