Rukmini Vasanth: లెహంగాలో రుక్మిణి అందాలు
వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో ఛాన్సులు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రుక్మిణీ వసంత్(rukmini vasanath). ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(appudu Ippudo eppudo)’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రుక్మిణి, ఇటీవల రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1(kanthara chapter1)లో హీరోయిన్ గా అవకాశం అందుకొని మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో రుక్మిణి లెవెల్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈమె తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా రుక్మిణి, పూజా కన్నన్(Pooja Kannan) డిజైన్ చేసిన పర్పుల్ కలర్ లెహంగా ధరించి, దీనికి కాంబినేషన్లో కలంకారీ తో డిజైన్ చేసిన పైటతో మేకోవర్ అయింది. పగడాలు పొదిగిన సింపుల్ జువెలరీ తో తన అందాన్ని మరింత రెట్టింపు చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.







