Rakul Preet Singh: టాలీవుడ్ ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న రకుల్?
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(Venkatadri express) మూవీతో టాలీవుడ్ లో మొదటి సక్సెస్ ను అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh) తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ లో భాగమైన రకుల్ టాలీవుడ్ లో ఆఖరిగా చేసిన సినిమా కొండపొలం. ఈ సినిమా తర్వాత అమ్మడు తన ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్ కు షిఫ్ట్ చేసింది.
బాలీవుడ్ కు వెళ్లి వరుస సినిమాలతో బిజీగా మారిన రకుల్ కు ఛాన్సులైతే వస్తున్నాయి కానీ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. నాలుగేళ్లలో రకుల్ నుంచి దాదాపు 9 మూవీస్ రాగా, వాటిలో ఏ ఒక్కటీ హిట్టవలేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ రకుల్ కు బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు కూడా అమ్మడి చేతిలో రెండు మూడు ప్రాజెక్టులున్నాయి కానీ వాటికి ఎలాంటి బజ్ లేదు.
ఈ నేపథ్యంలోనే రకుల్ మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. తన గత పరిచయాలను వాడి ఆఫర్లు అందుకోవాలని చూస్తుందట రకుల్. అందులో భాగంగానే తన పాత మేనేజర్ ను రంగంలోకి దింపి దర్శకనిర్మాతలకు టచ్ లో ఉంటుందట రకుల్. మరి రకుల్ అవసరాన్ని ఏ డైరెక్టర్ వాడుకుంటారో? ఆమె ఎలాంటి సినిమాతో కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.







